ఆమనగల్లులో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీల్లో మురుగు నీరు నిలిచిపోయింది. అలాగే రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లి సమస్యలను పరిశీలించారు. వెంటనే మురుగు నీటిని తొలగించి, రోడ్లపై పడిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.