ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఈ నెల 30 ఆఖరు గడువు
రిపోర్టర్: మహేష్
స్థలం: India
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ప్రతిష్టాత్మక గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్-2026 దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం జనరల్ మరియు స్పెషల్ స్కాలర్‌షిప్‌లను ఎల్‌ఐసీ అందజేస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలకు మించని అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.