భక్తిశ్రద్ధలతో వినాయక మండపాల్లో పూజలు నిర్వహించిన నేత దయాకర్ రెడ్డి

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలంలో శనివారం వినాయక మండపాల వద్ద కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అత్యంత పవిత్రమైందని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.