తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పోతుల బాలకోటయ్య ఫిర్యాదు

రిపోర్టర్: సునీల్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాయామ ఉపాధ్యాయుడిని కొట్టి దుర్భాషలాడారంటూ ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు లేఖ రాశారు. క్రీడా కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించలేదన్న కక్షతోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడు రమేష్, ప్రధానోపాధ్యాయురాలిని ఇంటికి పిలిపించి వేధించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని ఆయన మంగళవారం ఆ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.