వయసు కేవలం సంఖ్యేనంటూ: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న రిటైర్డ్ జడ్జి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి పూనమ్ ఎ బాంబా అరుదైన ఘనత సాధించారు. తన భర్త అనిల్ బాంబాతో కలిసి ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పూనమ్ ఎ బాంబా తెలిపారు. ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే పది రోజుల్లో దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల దూరం కఠినమైన వాతావరణంలో ప్రయాణించి ఈ సాహసం చేసినట్లు ఆమె వివరించారు.