సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసన

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

ఓట్ల చోరీ వ్యవహారంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఈసి దిష్టిబొమ్మను దహనం చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మండల నాయకులు పాల్గొన్నారు.