నలుగురు లంచం కేసులో పరారీలో ఉన్న సీజీఎస్టీ అదనపు కమిషనర్ వినయ్ కుమార్ అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
లంచం కేసుకు సంబంధించి పరారీలో ఉన్న రాయ్‌గఢ్ సీజీఎస్టీ అదనపు కమిషనర్ వినయ్ కుమార్ కాంతేటిని సీబీఐ అధికారులు రిషికేశ్‌లో అరెస్ట్ చేశారు. రూ.40 లక్షల లంచం డిమాండ్ చేసిన ఈ కేసులో ఇప్పటికే సుపరింటెండెంట్ రాకేష్ కుమార్ సిన్హా, కస్టమ్స్ హౌస్ ఏజెంట్ నరిందర్ రాజ్‌పుత్‌లను అరెస్ట్ చేయగా, హైకోర్టు ఆదేశాల తర్వాత వినయ్ కుమార్ పరారీలో ఉండటంతో అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.