బిజీ షెడ్యూల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు: బీసీసీఐ జాయింట్ సెక్రటరీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
భారత క్రికెటర్ల వరుస గాయాలపై బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. బిజీ షెడ్యూల్ వల్లే ఆటగాళ్లు గాయపడుతున్నారని, ఇకపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీమిండియా మేనేజ్‌మెంట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య సమన్వయ లోపం లేదని స్పష్టం చేశారు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేస్తూ, ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.