పెట్రోమ్యాక్స్ లైట్ వెలుతురులో చదివి ఐపీఎస్ సాధించిన శరణ్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
మహారాష్ట్రకు చెందిన శరణ్ గోపీనాథ్ కాంబ్లే నిరుపేద కుటుంబంలో జన్మించినా పట్టుదలతో ఐపీఎస్ సాధించారని అధికారులు తెలిపారు. రోజూ కూలీ పనులు, కూరగాయలు అమ్ముతూ తల్లిదండ్రులు ఆయనను చదివించారు. ఇంటర్ వరకు ఇంట్లో కరెంట్ లేకపోవడంతో కిరోసిన్ లాంతరు వెలుతురులోనే చదువుకున్నారు. వాల్చంద్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఐఐఎస్సీ బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేశారు. ఏటా ఇరవై లక్షల రూపాయల ప్రైవేట్ ఉద్యోగ ఆఫర్‌ను వదులుకుని సివిల్స్ సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారని పేర్కొన్నారు.