కృత్రిమ మేధ ముప్పుపై యూఎన్ భద్రతా మండలిలో శామ్ ఆల్ట్ మన్ హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ నియంత్రణకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ హెచ్చరించారు. ఏఐ అభివృద్ధిని ఆపలేమని, అయితే దాని వేగానికి అనుగుణంగా భద్రతా ప్రమాణాలు, అంతర్జాతీయ పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏఐ ద్వారా కొత్త ఆవిష్కరణలతో పాటు ముప్పు కూడా పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.