పది నిమిషాల్లో లీటరున్నర కోకాకోలా తాగి యువకుడు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: బీజింగ్
కేవలం పది నిమిషాల వ్యవధిలో ఒకటిన్నర లీటర్ల కోకాకోలా తాగిన ఇరవై రెండేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. బీజింగ్‌లోని చావోయాంగ్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వైద్య నివేదికలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అతడు ఒక్కసారిగా శీతల పానీయం తాగడంతో కడుపులో తీవ్రమైన వాయువు చేరి కాలేయం దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పద్దెనిమిది గంటల చికిత్స తర్వాత అతడు మృతి చెందినట్లు వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.