గాజువాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రావణి నక్షత్ర మహాభిషేకం
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక జీవీఎంసీ 65వ వార్డు బానోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ వైకుంఠవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణి నక్షత్రం సందర్భంగా మహాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసచార్యులు ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.