అసాంఘిక శక్తుల భరతం పట్టేందుకు డ్రోన్ల నిఘా నేత్రం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

చిట్వేల్ మండలం: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చిట్వేల్ మండలంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ L. సుబ్బరాయుడు IPS ఆదేశాల మేరకు, కోడూరు రూరల్ CI D. శ్రీనివాసులు ఆధ్వర్యంలో SI S. వినోద్ కుమార్ సిబ్బందితో కలిసి చెర్లోపల్లి, చిట్వేల్ టౌన్ ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించారు.