యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల చేసిన ఎన్టీఏ

రిపోర్టర్: శివ స్థలం: India

యూజీసీ నెట్ జూన్ 2026 రీ-పరీక్షల కోసం ఎన్టీఏ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. గతంలో జరిగిన పరీక్షల్లో తప్పులు దొర్లడంతో ఈ మూడు పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.