నర్సీపట్నంలో పద్మావతి గెలుపే లక్ష్యంగా ఇంటింటా సాగుతున్న విస్తృత ప్రచారం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతకాయల పద్మావతి భారీ మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా కౌన్సిలర్లు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు మేకల సత్యబాబు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించినట్లు ఆయన వెల్లడించారు.