వర్ధన్నపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని బొడ్రాయి వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం, కృష్ణుడి వేషధారణలో చిన్నారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యువకులు గోవింద నామస్మరణలతో ఉత్సాహంగా ఉట్టి కొట్టే పోటీల్లో పాల్గొన్నారు. యాదవ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.