ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు రష్యా కుబేరుడి నిధులు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు రష్యా కుబేరుడు ఉమర్ క్రెమ్లెవ్ నిధులు సమకూర్చినట్లు ఆయన భార్య బెట్టినా ట్రంప్ ధ్రువీకరించారు. బహామాస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకల ఖర్చును స్నేహితుడిగా ఆయన భరించారని తెలిపారు. దీనిని రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని, స్నేహానికి ఎలాంటి అజెండా ఉండదని ఆమె స్పష్టం చేశారు.