ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ తీరుపై బండి సంజయ్ మండిపాటు

రిపోర్టర్: వెంకట్ స్థలం: కరీంనగర్

ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కరీంనగర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ స్థాయి ఎంత దిగజారిందో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధాని వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు సరికాదని పేర్కొంటూ, ఇలాంటి భాషను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు.