బెంగళూరులో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో వినాయక చవితి కోసం అమ్మకానికి ఉంచిన విగ్రహాన్ని నలుగురు దుండగులు మినీ వాహనంలో వచ్చి ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 3:51 గంటల సమయంలో సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది. టార్పాలిన్ కప్పి ఉంచిన విగ్రహాన్ని వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు. మగడి రోడ్డు పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.