మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. MMDR సవరణ చట్టం-2026 ద్వారా గనుల రంగ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఇల్లు, పరిశ్రమ మరియు జీవనోపాధితో ముడిపడి ఉన్న ఈ రంగం దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. గనుల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ చట్టం అమలుద్వారా దేశవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని ఆయన వివరించారు.