గణనాథుని ఆగమనంతో మార్మోగిన వర్ధన్నపేట.. భక్తిశ్రద్ధలతో వినాయక శోభాయాత్ర
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వర్ధన్నపేటలో విఘ్నేశ్వరుని ఆగమనం ఘనంగా నిర్వహించబడింది. విగ్రహదాత గుజ్జ వీరన్న - పద్మ ఆధ్వర్యంలో, ఛత్రపతి శివాజీ యూత్ క్లబ్ నేతృత్వంలో ఈ ఆగమన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేపట్టారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ పట్టణ వీధుల్లో స్వాగత శోభాయాత్ర సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి మంగళహారతులతో నీరాజనాలు అర్పించారు. ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.