హాస్టల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్న సుధారాణి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎస్సీ బాలబాలికల వసతి గృహాలను ఏఎస్డబ్ల్యూవో సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, తువ్వాళ్లు, ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-2 పరీక్షల్లో విద్యార్థులంతా కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతోందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.