వర్షాల ధాటికి నేలకూలిన ఇల్లు అల్లాడుతున్న నిర్వాసితులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చింతపల్లి మండలం పశువులబంధ గ్రామానికి చెందిన రీమల సావిత్రి ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలిని ఓదార్చారు. ఏఎస్ఐతో పాటు మహిళా పోలీస్ సిబ్బంది గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు.