చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి జగన్‌కు లేదు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
పక్కా ప్రణాళికలతో ఎల్‌నినో పరిస్థితులను కూటమి ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వైకాపా అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.