స్థానిక ఎన్నికల వేళ ఏపీలో కలకలం: ఒక్కరోజే భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మొత్తం ముప్పై మూడు వేల పద్నాలుగు కేసులు, పదిహేడు వేల ఆరు వందల యాభై రెండు బైండోవర్ కేసులు నమోదైనట్లు పోలీస్ శాఖ గణాంకాలను విడుదల చేసింది.