ప్రముఖ సినీ దర్శకుడు పిఎన్ రామచంద్రరావుకు శ్రీ శారదా శతాబ్ది విశేష సమ్మాన్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ప్రముఖ సీనియర్ సినీ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావుకు ప్రతిష్ఠాత్మక శ్రీ శారదా శతాబ్ది విశేష సమ్మాన్ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని దేవభూమి, సీవీకే పార్క్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆయనను ఈ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కాశ్మీర్‌కు చెందిన శ్రీమద్ జగద్గురు శారదా సర్వజ్ఞ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో కాశ్మీర్ పీఠాధీశ్వరులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు, ముఖ్యంగా కాశ్మీర్ లోయలోని ప్రజల బాధలను తన కథనాల్లో ప్రతిబింబించిన తీరుకు ఈ జాతీయ స్థాయి గౌరవం దక్కింది.