ఖమ్మంలో నూతన ఎస్హెచ్ఓల బాధ్యతల స్వీకరణ: సీపీ సునీల్ దత్తో భేటీ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం వన్టౌన్, రఘునాథపాలెం పోలీస్స్టేషన్ల నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఇన్స్పెక్టర్లు ఎండి సాధిక్ పాషా, టి కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లకు సీపీ శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.