పాస్ పోర్ట్ నిబంధనలలో కీలక సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
విదేశీ ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక సవరణలు చేసింది. 15 సంవత్సరాల లోపు పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాలంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ తాజా సవరణల ప్రకారం పదిహేనేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై ఐదు సంవత్సరాలు లేదా వారికి 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టమైంది.