యూరప్ లో ఉప్పెనలా నిరసనలు: ఫ్రాన్స్ లో భీకర ఘర్షణలతో ఐదు వందల అరెస్టు

రిపోర్టర్: మహేష్ స్థలం: ప్యారిస్

జీవన వ్యయం విపరీతంగా పెరగడం మరియు ప్రజా సేవల వైఫల్యాలపై యూరప్ దేశాలలో తీవ్ర నిరసనలు చెలరేగుతున్నట్లు జర్నలిస్ట్ శ్రేయా చంద్ర వెల్లడించారు. ఫ్రాన్స్ దేశంలో మూడు లక్షల ఇరవై వేల మందికి పైగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టగా, ప్యారిస్ నగరంలో ముసుగు ధరించిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు మరియు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో ఐదు వందలకు పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.