ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి రేటు నమోదు

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవిక జిడిపి వృద్ధి రేటు ఆరున్నర నుండి ఏడు శాతం మధ్య నమోదు కానుందని జెఫరీస్ నివేదిక వెల్లడించింది. భౌగోళిక రాజకీయ సవాళ్లు, ఇంధన ధరల ముప్పు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పటిష్టతను ప్రదర్శిస్తోందని, నామినల్ జిడిపి పదకొండు నుండి పన్నెండు శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు.