రాష్ట్రపతి పాలన డిమాండ్ కేవలం రాజకీయ ఎత్తుగడ అంటూ పల్లా శ్రీనివాసరావు మండిపాటు

రిపోర్టర్: శివ స్థలం: Visakhapatnam

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసులు గాజువాక విశాఖపట్నం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి నిరాధార డిమాండ్లు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.