సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు తన అనర్హతపై వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన తనకు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, రాజకీయ పోరాటాన్ని ప్రజల మద్దతుతోనే ముందుకు తీసుకువెళ్తామని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.