పేదల అసైన్డ్ భూముల కబ్జాపై సర్కార్కు నల్లమాస మధుసూదన్ గౌడ్ హెచ్చరిక

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఇందిరమ్మ ఇచ్చిన పేదల అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జాదారులు, దళారుల చేతుల్లోకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నాయకులు నల్లమాస మధుసూదన్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అక్రమ భూముల లావాదేవీలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జా అయిన ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన ఎస్సీ, ఎస్టీ పేదలకే పంచాలని ఆయన కోరారు.