గురుకులంలో నాణ్యత లేని భోజనంపై జనసేన ఇన్ఛార్జ్ ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: గొలుగొండ

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యతా లోపాలను గుర్తించారు. మెనూ సక్రమంగా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ను కోరారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.