శతకలశాలతో కాణిపాకం పురవీధుల్లో చంద్రప్రభ వాహనసేవ ఊరేగింపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం చంద్రప్రభ వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఉభయదారులు, పదిహేడు గ్రామాల ప్రజలు శివాలయం నుంచి ఒక సావిరద నూరు ఆరు శతకలశాలతో కాణిపాకం పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారికి భక్తిశ్రద్ధలతో కలశాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు సమర్పించారు.