దేవుళ్లపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో రేవంత్రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

శివుడు పేదల దేవుడైతే రాముడు సంపన్నుల దేవుడంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఢిల్లీ వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను, ప్రాంతాలను వర్గాలుగా విడదీయడం తగదని ఆయన హితవు పలికారు. సనాతన ధర్మంలో హరిహరులకు భేదం లేదని స్పష్టం చేస్తూ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను బండి సంజయ్ గుర్తుచేశారు.