ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రారంభించిన ఆర్టీసీ

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

నర్సంపేట బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల సమయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ విచారణ కేంద్రం వద్ద ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది రెండు ఆరు ఒకటి ఆరు ఆరు నంబర్ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం.సరస్వతి తెలిపారు. బస్సుల బయలుదేరు సమయాలు, ఇతర వివరాల కోసం ప్రయాణికులు ఈ నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.