ట్రంప్ చర్యకు వ్యతిరేకంగా మాక్రాన్, కార్నీ సంయుక్త పర్యటన!
రిపోర్టర్: అశోక్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మరియు ఫ్రెంచ్ భూభాగాలను కలుపుతూ AI మ్యాప్‌ను షేర్ చేసిన నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. దీనికి దీటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ సెయింట్-పియర్-అండ్-మిక్వెలాన్ ద్వీపంలో సంయుక్త పర్యటనకు సిద్ధమయ్యారు. సార్వభౌమత్వాన్ని, జాతీయ సరిహద్దులను కాపాడుకోవడానికి ఈ పర్యటన ద్వారా వాషింగ్టన్కు గట్టి హెచ్చరిక పంపనున్నారు.