యాదాద్రి కొండపై అంగరంగ వైభవంగా రామలింగేశ్వర స్వామి ప్రత్యేక ఊరేగింపు

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వెంచేసి ఉన్న పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారిని శివాలయంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి సేవా పీఠంపై అధిష్టింపజేసి పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు.