భాజపా కార్మిక విభాగం జిల్లా కో-కన్వీనర్గా మునగాల రాజశేఖర్రెడ్డి నియామకం

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన మునగాల రాజశేఖర్రెడ్డి భాజపా కార్మిక విభాగం జిల్లా కో-కన్వీనర్గా నియమితులయ్యారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ అందే శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ ఐతరాజు సిద్ధు కలిసి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని రాజశేఖర్రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.