స్థానిక పోలింగ్ కు బడులు ప్రభుత్వ ఆఫీసులకు భారీగా సెలవులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, ఈ నెల అయిదున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణ కోసం నవంబర్ నాలుగు, ఐదు తేదీల్లో సంబంధిత పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల ఏడున కౌంటింగ్ జరిగే విద్యాసంస్థలకు కూడా సెలవు వర్తించనుంది.