అనారోగ్యంతో బాధపడుతున్న రవీందర్ రావుకు నేతల భరోసా

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

అనారోగ్యంతో బాధపడుతున్న టీడబ్ల్యూజేఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేన్నేని రవీందర్ రావును ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ పరామర్శించారు. జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లిన నాయకులు రవీందర్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు కాసం శ్రీనివాస్ రెడ్డి, రాగం రమేష్, ఇతర ఫెడరేషన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు.