మల్కాపురం చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం గ్రామంలో వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో మృతుడిని గుంటూరు జిల్లాకు చెందిన అన్నవరపు నాగరాజుగా గుర్తించారు. చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.