వెస్టిండీస్‌తో తొలి వన్డేలో అరుదైన రికార్డులపై కోహ్లీ గురి
రిపోర్టర్: విజయ్
స్థలం: Thiruvananthapuram
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పలు భారీ రికార్డులపై కన్నేశాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ మరో 59 పరుగులు సాధిస్తే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాకుండా స్వదేశంలో అత్యధిక శతకాల వీరుడు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.