'భూములు ఎక్కడ కనిపించినా గద్దల లెక్క వాలిపోయారు': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు లక్ష కోట్ల భూములను కొల్లగొట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరణిని అడ్డం పెట్టుకుని భూదాన్, అసైన్డ్, వక్ఫ్ భూములను ఆక్రమించుకున్నారని, సిరిసిల్ల, సంగారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగిన భూ కుంభకోణాలపై ఎస్ఈటీ (SET) విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. ఈ అక్రమాల చర్చ నుంచి తప్పుకునేందుకే ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించి బయటికి వెళ్లాయని విమర్శించారు.