తెలంగాణలో మద్యం విక్రయాల రికార్డ్: నాలుగు రోజుల్లోనే రూ. 755 కోట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టించాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. పండుగకు ముందు ఉన్న కేవలం నాలుగు పనిదినాల్లోనే ఏకంగా రూ. 755 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 57 కోట్లకు పైగా అదనపు వృద్ధి నమోదైందని, ఈ భారీ ఆదాయం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎంతో ఊతమిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.