ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ నిప్పులు: హైదరాబాద్ తగలబడిపోతుందని హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈసీ వైఖరి మార్చుకోకపోతే నగరంతో పాటు ఈసీ కార్యాలయం తగలబడిపోతుందని వివాదాస్పద హెచ్చరిక చేశారు. బీజేపీతో చేతులు కలిపి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.