విశాఖ ఎంవీపీ కాలనీలో సంచరించిన భారీ కొండచిలువ కలకలం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఎంవీపీ కాలనీ సెక్టార్ 12లో భారీ కొండచిలువ సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా సచివాలయం రోడ్డుపైకి భారీ కొండచిలువ రావడంతో అప్రమత్తమైన జీవీఎంసీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై పాకుతున్న ఆ కొండచిలువను సిబ్బంది సురక్షితంగా పట్టుకుని తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.