ఫొటోగ్రాఫర్‌పై హీరోయిన్ తారా సుతారియా ఫైర్
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
ముంబైలో వర్షం పడుతున్న సమయంలో తనను అతి చేరువగా ఫొటో తీయబోయిన ఫొటోగ్రాఫర్‌పై బాలీవుడ్ నటి తారా సుతారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో కెమెరాను దూరంగా నెట్టివేసిన ఆమె చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆత్మరక్షణలో భాగంగా చేసిన పనని, ప్రతిదానికీ ఒక పరిధి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.