పొదలకూరు రహదారిపై ఇసుక మూట చాటున పొంచివున్న గండం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రహదారి స్వర్ణ లే-అవుట్ వద్ద ప్రధాన రహదారి తరచూ కుంగిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి రహదారిపై అడుగు లోతున పెద్ద గుంత ఏర్పడటంతో, ప్రమాదాలు జరగకుండా స్థానికులు అందులో ఇసుక మూటను అమర్చారు. అధికారులు కేవలం తాత్కాలిక పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని, పదేపదే ఏర్పడుతున్న ఈ గుంతల సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.